చిత్రం : సూసైడ్ క్లబ్
సమర్పణ : 3 i ఫిలిమ్స్
నటి నటులు : శివరాంచంద్రవరపు, ప్రవీణ్ ఎండమూరి, చందనా, సందీప్‌రెడ్డి, వెంకటకృష్ణ, సాకేత్సింఘ్
నిర్మాతలు : వీణ్ ప్రభు వెంకటేశం , 3 i ఫిలిమ్స్,
దర్శకత్వం : శ్రీనివాస్ బొగడపాటి,
రేటింగ్ : 3. 5 / 5
3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ప్రధాన పాత్రదారులుగా శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. ప్రవీణ్ ప్రభు వెంకటేశం , 3 i ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం ఉంది . కాగా చిత్ర యూనిట్ ఇటీవల ఈ సినిమాను సినీ ప్రముఖులకు , మీడియా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది . మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం
కథః
ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే ఆరుగురు వ్యక్తుల కథతో ఈ ఫిలిం రూపొందింది.. ఈ క్రమం లో ఒక్కొక్కరు తమ కథల్ని వినిపిస్తుంటారు. అందులో హీరోయిన్ ప్రియ భర్త తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామనీ, తరవాత వేరే హీరోతో ఎఫైర్ పెట్టుకొని వదిలేసిందని చెప్తాడు .ఒక్కొక్కరు తమ పరిస్థితులు ,ఇబ్బందులు చెప్పుకుంటారు .. మరి చివరికి ఈ ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారా ..? లేదా ..? అసలు సూసైడ్ క్లబ్ ఎందుకు పెట్టాల్సివచ్చింది ..? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే .
నటీనటులుః
శివరాంచంద్రవరపు, ప్రవీణ్ ఎండమూరి, చందనా, సందీప్‌రెడ్డి, వెంకటకృష్ణ, సాకేత్సింఘ్ తదితరులు నటించారు. వెంకటకృష్ణ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఐదు నిముషాల అన్న డైలాగ్‌తో దియేటర్ మొత్తం చాలా హైప్‌ని క్రియేట్ చేసింది. చందన కూడా సినిమా మొత్తంలో ఒకే ఒక్క లేడీ అయినా తన పాత్ర వరకు చాలా బాగా నటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా కుదిరాయి. శ్రీనివాస్ బొగడపాటి కథను ఎంత అద్భుతంగా రాశారో ..అంతే బాగా తీశారు. కెమెరా ఫొటోగ్రఫీ చాలా బావున్నాయి.
విశ్లేషణః
నిడివి 45 నిముషాలపాటు సాగుతోంది. ఇది హిందీ, తెలుగు భాషలలో నిర్మించారు. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలకు నయం చేశారు. చాలా సింపుల్ కథాంశంతో వున్న ఈ పాత్రలకు ఎవరికి వారు బాగానే నటించారు. అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలనే వారికి ఈ ఫిలిం ఓ క్లారిటీ వుంటుంది. ఒకే లొకేషన్లో ఒకే టైంలో ఆరుగురు వ్యక్తులతో కథను ఆసక్తిగా నడిపించాడు. అయితే ఇది కేవలం ఓ ఎవేర్నెస్ కోసం తీసిందే.. దర్శకుడు తనకు తెలిసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తీశాడనే చెప్పాలి. అలాగే ఇందులో నటించిన నటీనటులందరూ చాలా న్యాచరల్‌గా మేకప్ లేకుండా చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే కథ , స్క్రీన్ ప్లే లో కొత్త ధనం , థ్రిల్లింగ్ ,ట్విస్టులు ఇస్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది